Telugu Film Chamber Elections July 30 - Sakshi
Sakshi News home page

Film Chamber Election: ఎలక్షన్స్‌కి రెడీ అయిన ఫిల్మ్ ఛాంబర్

Jul 21 2023 8:43 PM | Updated on Jul 21 2023 8:54 PM

Telugu Film Chamber Elections July 30 - Sakshi

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, శుక్రవారంతో అంటే జూలై 21తో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ క్రమంలోనే జూలై 30న ఎలక్షన్స్ జరగనున్నాయి. నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇకపోతే సి.కల్యాణ్ ఇప‍్పటికే టాలీవుడ్‌లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ వర్క్ చేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ‍్లిద్దరి ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

(ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)

Advertisement
 
Advertisement
Advertisement