దీపావళి కానుకగా ‘టాక్సీ’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుదల | Taxi Movie First Look release On Diwali | Sakshi
Sakshi News home page

దీపావళి కానుకగా ‘టాక్సీ’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ విడుదల

Nov 4 2021 4:49 PM | Updated on Nov 4 2021 4:49 PM

Taxi Movie First Look release On Diwali - Sakshi

వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , ప్రవీణ్ యండమూరి, సద్దాం హుస్సేన్, నవీన్ పండిత తదితరులు వారు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ట్యాక్సీ’,. హెచ్ అండ్ హెచ్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై హరిత సజ్జ ఈ మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన హరీష్ సజ్జా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బిక్కి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవరిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు మేకర్స్‌.

వైవిధ్యమైన కథాంశంతో సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ట్యాక్సీ రూపొందుతోంది. ఇందులోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎన్నో ఉంటాయని తెలిపారు.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ‘లవ్ స్టొరీ’ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసిన బీజే శ్రీధర్ కూడా ఫైట్స్ కంపోజ్ చేస్తుండడం మరో విశేషం. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement