కోలీవుడ్‌లో విషాదం.. గుండెపోటుతో హీరో కన్నుమూత | Tamil Hero Ganga Passed Away | Sakshi
Sakshi News home page

Actor Ganga: కన్నుమూసిన సీనియర్‌ హీరో.. పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే..

Nov 12 2023 10:25 AM | Updated on Nov 12 2023 11:09 AM

Tamil Hero Ganga Passed Away - Sakshi

ఈయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. ఉయిరుళ్లవరై ఉషా చిత్రంతో హీరోగా ఎంట్రీ.. ఇది సక్సెస్‌ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా క్రైం తొడుమ్‌ అలైగళ్, మురుగేశన్‌ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు.

సినీ నటుడు గంగా (53) శుక్రవారం సాయంత్రం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన టి.రాజేందర్‌ దర్శకత్వం వహించిన ఉయిరుళ్లవరై ఉషా చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. నటి నళిని హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అప్పట్లో ఘనవిజయం సాధించింది. దీంతో నటుడు గంగాకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా క్రైం తొడుమ్‌ అలైగళ్, మురుగేశన్‌ తునై, మామండ్రం, సావిత్రి వంటి చిత్రాల్లో నటించారు.

ఆ తరువాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ నటించారు. అనంతరం కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించిన గంగా మరికొన్ని టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం కూడా వహించారు. స్థానిక మైలాపూర్‌లో నివసిస్తున్న ఈయన పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. కాగా శుక్రవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఈయన భౌతిక కాయాన్ని సొంతూరు చిదంబరం సమీపంలోని భరత్తూర్‌ చావడి గ్రామానికి తరలించి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌ ‘టైగర్‌-3’ మూవీ ఎలా ఉందంటే..
900కుపైగా సినిమాల్లో నటన.. తొలి చిత్రానికే నంది అవార్డు

Advertisement
 
Advertisement
Advertisement