Taapsee Pannu Shocking Comments On Her Boyfriends - Sakshi
Sakshi News home page

అవును.. అలాంటి వాళ్లతో డేటింగ్‌ చేశా.. తాప్సి షాకింగ్‌ కామెంట్స్‌

Jan 27 2022 12:40 PM | Updated on Jan 27 2022 12:46 PM

Taapsee Pannu Shocking Comments On Her Boyfriends - Sakshi

‘ఝుమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి పరిచయం అయిన తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత ఇక్కడ పలు సినిమాల్లో నటించి, మెప్పించి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ ఈ సొట్టబుగ్గల సుందరికి మంచి కాన్సెప్ట్‌ ఉన్న కథలు దొరకడంతో బాలీవుడ్‌లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె ఎన్నో హిట్లు కూడా అందుకుంది. ప్రస్తుతం ఏడాదికి ఆరేడు సినిమాలు చేస్తూ ఏ హీరోయిన్ లేనంత బిజీగా గడుపుతోంది తాప్సీ. అలాగే డిజిటల్‌ రంగలో కూడా రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే తాప్సీ.. తాజాగా తన బాయ్ ఫ్రెండ్స్‌పై  షాకింగ్‌ కామెంట్‌ చేసింది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో .. మీరెప్పుడైనా పనికిరాని బాయ్ ఫ్రెండ్ తో డేటింగ్ కి వెళ్ళారా అని ప్రశ్నించగా.. `అవును.. నేను చాలా మంది పనికిరాని బాయ్ ఫ్రెండ్స్ తో డేటింగ్ చేశాను` అని చిరునవ్వులు చిందిస్తూ సమాధానం ఇచ్చింది.  అలాగే తన ప్రస్తుత  బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ.. ‘నేను  మాథ్యూస్ ను మా నాన్నకు పరిచయం చేసినప్పుడు.. అన్నింట్లో తప్పులు వెతికే మా నాన్న. .అతడి ఎంపికలో ఎలాంటి తప్పును కనిపెట్టలేదు’అని చెప్పుకొచ్చింది తాప్సీ.  గతంలో తన తొలి చిత్ర దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసిన తాప్సీ.. తాజాగా తన స్నేహితులపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement