నేను బతకొద్దా.. రెమ్యునరేషన్‌ పెంపుపై సుహాస్‌ వ్యాఖ్యలు | Hero Suhas Reply To Media Questions About His Remuneration Hike - Sakshi
Sakshi News home page

Suhaas: రూ.3 కోట్ల పారితోషికం.. హీరో సుహాస్‌ ఏమన్నాడంటే?

Mar 7 2024 7:12 PM | Updated on Mar 7 2024 8:05 PM

Suhaas About His Remuneration Hike For Prasanna Vadanam Movie - Sakshi

నేను బతకొద్దా.. జూనియర్‌ ఆర్టిస్టుగా రోజుకు వంద రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చాను. నాకూ ఎంతో కొంత తీసుకోవాలని ఉంటుందిగా! కాకపోతే మ

ఒకప్పుడు చిన్నాచితకా పాత్రలు చేసుకుంటూ వచ్చిన సుహాస్‌.. ఇప్పుడు హీరో రేంజ్‌కు ఎదిగిపోయాడు. సక్సెస్‌ అన్న పదానికి నిర్వచనంలా మారాడు. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీతో సూపర్‌ హిట్‌ తన ఖాతాలో వేసుకున్న సుహాస్‌ ప్రస్తుతం ప్రసన్నవదనం అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సుహాస్‌కు ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. 

అందుకే కొత్తవారికి ఛాన్స్‌
మీ రెమ్యునరేషన్‌ మూడు వేల నుంచి మూడు కోట్లకు పెంచారట కదా? అన్న ప్రశ్నకు సుహాస్‌ స్పందిస్తూ.. పారితోషికం పెంచాలి కదా! నేను బతకొద్దా.. జూనియర్‌ ఆర్టిస్టుగా రోజుకు వంద రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇక్కడిదాకా వచ్చాను. నాకూ ఎంతో కొంత తీసుకోవాలని ఉంటుందిగా! కాకపోతే మరీ మీరు అనుకున్నంత కాదు అని నవ్వేశాడు. ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశమివ్వడానికి కారణమేంటన్న ప్రశ్నకు.. ఎవరైనా మొదటి సినిమాను ప్రేమించినట్లు తర్వాతివాటిని ప్రేమించరు. అందుకే చాలామటుకు కొత్తవాళ్లతో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు.

నా బతుకేంటో నాకే..
యూట్యూబ్‌ నుంచి మొదలై మంచి హీరోగా ఎదిగారు. కొత్తగా వచ్చే హీరోలకు ఏమైనా సందేశమిస్తారా? అన్న ప్రశ్నకు.. నా బతుకేంటో నాకే అర్థం కావట్లేదు.. నీ భవిష్యత్తు ఎవడికి కావాలి? అని ఓ డైలాగ్‌ ఉంటుంది.. నా పరిస్థితి కూడా అలాంటిదే! నేను హీరో అవుతాననే అనుకోలేదు. అంతా ఓ కలలా ఉంది. ఎవరైనా హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది. షార్ట్‌ ఫిలింస్‌లో మన  టాలెంట్‌ చూపిస్తే సినిమా ఛాన్సులు అవే వస్తాయి అని సలహా ఇచ్చాడు.

చదవండి: Hanuman Movie: ఓటీటీలో హనుమాన్‌?.. ఇప్పట్లో లేనట్లేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement