Sudheer Babu's Harom Hara First Trigger Released - Sakshi
Sakshi News home page

Harom Hara: కుప్పం బ్యాక్‌డ్రాప్‌లో హరోం హర, గ్లింప్స్‌ చూశారా?

May 11 2023 8:44 AM | Updated on May 11 2023 9:48 AM

Sudheer Babu Harom Hara Glimpse Released - Sakshi

సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ విడుదల చేశారు. అందరూ పవర్‌ కోసం గన్‌ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అని సుధీర్‌ బాబు కుప్పం యాసలో చెప్పే డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ఉంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథతో రూపొందుతు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం హరోం హర. ది రివోల్ట్‌ అనేది ఉప శీర్షిక. జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో సుమంత్‌ జి.నాయుడు నిర్మిస్తున్నారు. నేడు(మే 11) సుధీర్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ విడుదల చేశారు. అందరూ పవర్‌ కోసం గన్‌ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అని సుధీర్‌ బాబు కుప్పం యాసలో చెప్పే డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ఉంది.

చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే సుధీర్‌ బాబు మరోపక్క మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. దర్శకుడు హర్షవర్ధన్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాలిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

చదవండి: హీరోలకే ఎక్కువ పారితోషికం, వ్యత్యాసం ఎందుకు?: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement