SS Rajamouli Actress Saloni Latest Clicks In Hyderabad Goes Viral - Sakshi
Sakshi News home page

Actress Saloni: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన మర్యాద రామన్న హీరోయిన్

Feb 8 2023 7:00 PM | Updated on Feb 8 2023 8:36 PM

SS Rajamouli Actress Saloni Clicks In Hyderabad Goes VIral - Sakshi

సాధారణంగా హీరోయిన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవటం చాలా కష్టమే. కొందరు తక్కువకాలంలోనే స్టార్‌డమ్ సొంతం చేసుకుంటే మరికొందరేమో మరిన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తారు. ఇండస్ట్రీలోకి అలా వచ్చి ఇలా వెళ్లేవారిని వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.  అలాంటి వారిలో ముందువరుసలో ఉంటుంది ఆ నటి. దర్శకధీరుడు రాజమౌళితో హిట్‌ కొట్టిన హీరోయిన్ ఆ తర్వాత కనుమరుగైనపోయింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? మర్యాద రామన్నలో మెప్పించిన సలోని. 

తాజాగా హైదరాబాద్‌లోని ఓ జువెలరీ ర్యాంప్‌ షోలో కనిపించింది భామ. ఆమెను చూసిన చాలామంది అభిమానులు మొదట గుర్తు పట్టలేకపోయారు. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా అంత ఈజీగా మరిచిపోయే గ్లామర్ కాదు. సునీల్‌తో మర్యాద రామన్నలో కనిపించిన నటి ఇప్పుడు చూస్తే షాకవ్వడం ఖాయం. అప్పుడు సన్నగా ఉన్న సలోని ఇప్పుడేమో కాస్త బొద్దుగా కనిపించే సరికి గుర్తుపట్టడం కష్టమైంది. ఈ సినిమాకు ముందు సలోని గురించి ఎవరికీ తెలియదు. అంతుకుముందు ఆమె చేసిన కొన్ని సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్లాయనేది కూడా తెలీదు. సునీల్‌ హీరోగా నటించిన ఈ సినిమాతో రాజమౌళి హిట్ కొట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement