'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్‌.. స్పందించిన శ్రీలీల | Sreeleela Response On Pushpa 2 Special Song Kissik Remuneration | Sakshi
Sakshi News home page

‘పుష్ప’ ఐటమ్‌ సాంగ్‌ రెమ్యునరేషన్‌పై స్పందించిన శ్రీలీల

Nov 27 2024 1:05 PM | Updated on Nov 27 2024 1:15 PM

Sreeleela Response On Pushpa 2 Special Song Kissik Remuneration

ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్‌ సాంగ్‌ ‘కిస్సిక్‌’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్‌, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్‌ కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్‌. ఈ ఐటమ్‌ సాంగ్‌  కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్‌ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్‌ టీమ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్‌, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా పుష్ప ఐటమ్‌ సాంగ్‌ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్‌ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్‌ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్‌ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్‌ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.

ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్‌- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహించారు. బ్లాక్‌ బస్టర్‌ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement