విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్‌ వైరల్‌ | Sreeja Konidela Reacts To Netizen Question On Divorce, Post Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్‌ వైరల్‌

May 7 2024 7:36 AM | Updated on May 7 2024 6:19 PM

 Sreeja Konidela Comments On Divorce

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తెలుగువారికి సుపరిచితమే. 2016లో శ్రీజ.. నటుడు కళ్యాణ్ దేవ్‌ను వివాహాం చేసుకుంది. ఈ జంటకు 2018లో ఓ కూతురు కూడా జన్మించింది. అయితే, పలు విభేదాల కారణంగా ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు. వీరి ముద్దుల కూతురు నవిష్క వారంలో కొద్ది రోజులు మాత్రమే కల్యాణ్‌ దేవ్‌ వద్ద ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీజ నెటిజన్లకు టచ్‌లోనే ఉంటుంది.

విడాకుల అంశం గురించి శ్రీజ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పందించింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ స్టోరీ పోస్ట్ చేసింది. కానీ ఆమె తన భర్తతో విడాకుల గురించి రియాక్ట్‌ కాలేదు. సోషల్‌ మీడియా ద్వారా ఓ అమ్మాయి ది ఆంగ్రీ థెరపిస్ట్ అనే అకౌంట్‌కు ఇలా ప్రశ్న పంపింది. 'నా భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది. కానీ, నా భర్తే ఈ విషయంలో అడ్డు పడుతున్నాడు. తన మీద ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని కోరుతున్నాడు. ఇప్పుడేం చేయాలి..?' అని అడిగింది. ఇందుకు సమాధానంగా వాళ్లు.. ఆయనతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు క్వశ్చన్‌ చేసుకోండి  అంటూ చెప్పుకొచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ అంశంలో ఇతరుల ప్రమేయం లేకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.

ఈ క్రమంలో  విడాకుల విషయంపై ఆ అమ్మాయికి వారు ఇలా సూచించారు. 'బబుల్ బాత్ చేయడం, స్పాకి వెళ్లడం, నచ్చిన డ్రెస్సులు కొనుక్కోవడం, చక్కగా రెడీ కావడం, మీకు నచ్చిన గిఫ్టులు మీరే కొనుక్కోవడం అనేది సెల్ఫ్ లవ్. ఈ విషయంలో మళ్లీ ఒక్కసారి ఆలోచించండి. సెల్ప్ కేర్ వర్సెస్ సెల్ఫ్ లవ్ అనే పోరాటంలో మనల్ని మనం ప్రేమించుకునే దమ్ము, ధైర్యం మీకుందా..?' అని ఆ యువతితో వారు చెప్పుకొచ్చారు. ఈ మెసేజ్‌లను శ్రీజ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. గతంలో కూడా శ్రీజ సెల్ఫ్‌ లవ్‌ అంటూ పలు పోస్టులు పెడుతుండేది. దీనినిబట్టి చూస్తే భవిష్యత్‌లో ఎవరితోనూ ప్రేమలో పడేది ఉండదని ఆపై పెళ్లి చేసుకునే ఛాన్స్‌ కూడా లేదన్నట్లుగా ఆమె మెసేజ్‌లు ఉన్నాయని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.

వ్యాపారంలో శ్రీజ తొలి అడుగు
కొద్దిరోజుల క్రితం శ్రీజ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. స్టూడియో అనంత పేరుతో హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ను ఆమె ప్రారంభించింది. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్‌నెస్ సెంటర్‌లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ గతంలో శ్రీజ తెలిపింది. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో జిమ్, యోగా కూడా ఉంటాయని ఆమె చెప్పింది.

 

Advertisement
 
Advertisement
Advertisement