'ఏ యాసతో అవమానాలు పడ్డదో.. ఇప్పుడదే ఆమెను స్టార్‌ను చేసింది' | A Special Article On About Tollywood Anchor Jordar Sujatha | Sakshi
Sakshi News home page

Jordar Sujatha: 'పోలీస్‌ కావాలనుకుంది.. స్టార్‌గా ఎదిగిపోయింది'

Jun 18 2023 11:19 AM | Updated on Jun 18 2023 3:21 PM

A Special Article On About Tollywood Anchor Jordar Sujatha - Sakshi

ఏ యాస మాట్లాడి అవమానపడ్డదో.. ఆ యాసతోనే పాపులర్‌ అయిన నటి.. జోర్దార్‌ సుజాత. కయ్యకయ్య అరుస్తూనే కమ్మని పదాలతో.. శనార్తులంటూ వరుస బుల్లితెర అవకాశాలతో పాటు, వెబ్‌ ప్రపంచంలోకీ అడుగుపెట్టిన ఆమె గురించి కొన్ని వివరాలు..!

సుజాత అసలు పేరు శ్రుతి. స్వగ్రామం వరంగల్‌ జిల్లా.. ఉప్పర్‌ పల్లి. అమ్మ అంగన్‌వాడీ టీచర్‌. నాన్న  ప్రైవేట్‌ టూరిస్ట్‌ బస్‌ డ్రైవర్‌. ముగ్గురు అక్కాచెల్లెళ్లలోకి తనే చిన్నది. ఇద్దరు అక్కలకు ఇంటరైపోయిన వెంటనే పెళ్లి చేశారు. తన వంతు వచ్చేసరికి పోలీసు ఉద్యోగం సాధిస్తానని తల్లిదండ్రులను ఒప్పించి డిగ్రీ పూర్తి చేసింది. ఉద్యోగంతోనే ఇంటికి తిరిగి వస్తానని హైదరాబాద్‌ వచ్చింది. మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది. అయితే తన యాస, తీరు వల్ల అక్కడ ఇమడలేకపోయింది. 

(ఇది చదవండి: నాపై 8 నెలలు విషప్రయోగం చేశారు: జేడీ చక్రవర్తి ఎమోషనల్‌)

ఆ తర్వాత టీవీ చానళ్లలో తెలంగాణ యాసకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసి.. అక్కడ ప్రయత్నించింది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ ‘జోర్దార్‌ సుజాత’గా మారి మంచి గుర్తింపు పొందింది. అదే.. ఆమెకు బుల్లితెర అవకాశాలనూ తెచ్చిపెట్టింది. ఇక బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 

ఇప్పుడిప్పుడే సినిమాలకు కూడా అడుగుతుండ్రు. సిస్టర్‌ రోల్స్, ఫ్రెండ్‌ రోల్స్‌ చాలానే వస్తున్నయి. ఇంకేదీ ఫైనల్‌ చేయలేదు. మనమేదైనా చేస్తే టర్నింగ్‌ పాయింట్‌ లెక్క ఉండాలేగనీ, ఏదో చేస్నున్నవా అంటే చేస్తున్న అన్నట్లు ఉండొద్దు కదా?
– సుజాత

పలు టీవీ షోలు, సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా మారింది. తర్వాత తన పేరు మీదనే సొంతంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి మరింత పాపులర్‌ అయింది. ఈ మధ్యనే జబర్దస్త్‌ కమేడియన్‌ రాకింగ్‌ రాకేశ్‌ను ప్రేమ వివాహం చేసుకొని, జీవితంలో మరో అడుగు ముందుకు వేసింది.  ‘సేవ్‌ ది టైగర్స్‌’ సిరీస్‌తో వెబ్‌ దునియాలోనూ తన జోరు సాగిస్తోంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతోన్న ఈ సిరీస్‌లో.. తెలంగాణ యాసలో సుజాత అందంగా తిట్టిన తిట్లు.. సోషల్‌ మీడియాలో రీల్స్‌గా మారి తెగ వైరల్‌ అవుతున్నాయి. 

(ఇది చదవండి: టాలీవుడ్ యాంకర్‌తో పెళ్లి.. మా బంధం అలాంటిది: జేడీ చక్రవర్తి)

Advertisement
 
Advertisement
Advertisement