మురారి రీ రిలీజ్‌.. హీరోయిన్ రియాక్ట్ అయిందిగా! | Sonali Bendre Responds On Mahesh Babu Movie Murari Re Release | Sakshi
Sakshi News home page

Sonali Bendre: మురారి రీ రిలీజ్‌.. సోనాలి బింద్రే రియాక్షన్ ఇదే!

Aug 10 2024 4:47 PM | Updated on Aug 10 2024 4:54 PM

Sonali Bendre Responds On Mahesh Babu Movie Murari Re Release

టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్‌ మూవీ మురారి రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల వద్ద మహేశ్ ఫ్యాన్స్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా 23 ఏళ్ల తర్వాత రావడంతో అభిమానులు సందడి చేశారు. కొందరైతే ఏకంగా థియేటర్లోనే పెళ్లి కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున వైరలయ్యాయి.

అయితే తాజాగా మురారి రీ రిలీజ్‌పై హీరోయిన్ సోనాలి బింద్రే స్పందించింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెప్పించిన బాలీవుడ్ భామ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. మహేశ్‌తో మురారి సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. 23 ఏళ్ల తర్వాత కూడా మురారి సినిమాపై అదే ప్రేమ చూపించడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించింది. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.. ఈ చిత్రాన్ని మాకు ఇంత ప్రత్యేకంగా మార్చిన డైరెక్టర్‌ కృష్ణ వంశీకి అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement