తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా? | Siddu Jonnalagadda Jack Movie Day 1 Collection | Sakshi
Sakshi News home page

Jack Collection: బాక్సాఫీస్ దగ్గర 'జాక్'.. ఘోరమైన వసూళ్లు!

Apr 11 2025 4:48 PM | Updated on Apr 11 2025 5:00 PM

Siddu Jonnalagadda Jack Movie Day 1 Collection

'టిల్లు' సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధు.. తాజాగా థియేటర్లలోకి 'జాక్'గా వచ్చాడు. ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. అయినా సరే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. తొలిరోజు మిక్స్ డ్ రివ్యూస్ రాగా.. రెండో రోజుకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. 

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) 

హైప్ లేకపోవడంతో తొలిరోజే పెద్దగా ఎవరూ థియేటర్లలోకి రాలేదు. సిద్ధు, 'బేబీ' వైష్ణవి చైతన్య ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట‍్లు తెలుస్తోంది.

సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్ల వరకు తొలిరోజు వసూళ్లు రాగా.. 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. టాక్ ఇలానే ఉంటే గనక వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మూవీ నిలబడటం కష్టమే!

(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement