చిన్న ప్రమాదమే, క్షేమంగానే ఉన్నాను: శర్వానంద్‌ | Sharwanand Reacts on his car road accident | Sakshi
Sakshi News home page

నేను క్షేమంగా ఉన్నాను: శర్వానంద్‌

May 29 2023 12:28 AM | Updated on May 29 2023 7:13 AM

Sharwanand Reacts on his car road accident - Sakshi

‘నా కారు చిన్న ప్రమాదానికి గురైంది. కానీ, నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ హీరో శర్వానంద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ జంక్షన్ లో శర్వానంద్‌ ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

దీనిపై సోషల్‌ మీడియా వేదికగా శర్వానంద్‌ స్పందిస్తూ – ‘‘ఈ రోజు (ఆదివారం) ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడొద్దు’’ అన్నారు. కాగా జూన్  3న రాజస్థాన్ లో శర్వానంద్‌ వివాహం రక్షితతో జరగనున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement