సిగరెట్‌ తాగడం మానేస్తున్నా.. కానీ ఇప్పటికీ..: షారూఖ్‌ | Shah Rukh Khan Reveals He Quits Smoking, Says I Thought I Wont Feel So Breathless, Watch Video Goes Viral | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan On Smoking: రోజుకు వంద సిగరెట్లు తాగిన హీరో.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్‌!

Nov 3 2024 6:46 PM | Updated on Nov 4 2024 11:01 AM

Shah Rukh Khan Quits Smoking: Still Feel So Breathless

బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ సిగరెట్‌కు బానిస.. రోజుకు ఒకటీరెండు ప్యాకెట్లు కాదు ఏకంగా వంద వరకు సిగరెట్లు కాల్చేవాడు. ఇలా అస్తమానూ సిగరెట్లు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా? అని అటు కుటుంబం, ఇటు అభిమానులు ఎంతో కంగారుపడేవాళ్లు. ఈ వ్యసనానికి దూరం కావాలని షారూఖ్‌ ఎన్నోసార్లు అనుకున్నాడు. చివరాఖరకు ఆ వ్యసనంపై విజయం సాధించానంటున్నాడు. నవంబర్‌ 2న బర్త్‌డే జరుపుకున్న ఇతడు అభిమానులను కలుసుకునేందుకు మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశాడు.

గుడ్‌ న్యూస్‌
ఈ కార్యక్రమంలో షారూఖ్‌ మాట్లాడుతూ.. 'మీకో మంచి విషయం చెప్పబోతున్నాను. నేను సిగరెట్లు తాగడం ఆపేశాను. కానీ దమ్ము లాగడం ఆపేశాక కూడా శ్వాససమస్యలు తగ్గలేదు. ఇప్పటికీ కొన్నిసార్లు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిపడుతూనే ఉన్నాను. దేవుడి దయ వల్ల త్వరలోనే ఈ ఇబ్బంది కూడా పోయి అంతా బాగుంటుందని ఆశిస్తున్నాను' అన్నాడు. షారూఖ్‌ నోటి నుంచి ఈ మాటలు వినగానే అభిమానులు సంతోషంతో చప్పట్లు కొట్టారు.

తిండి కూడా మానేసి..
కాగా 2011లో ఓ ఇంటర్వ్యూలో షారూఖ్‌.. తాను రోజుకు వంద సిగరెట్లు తాగిన విషయాన్ని బయటపెట్టాడు. తిండి, నీళ్లు అన్నీ మానేసి కేవలం దమ్ము కొడుతూ కూర్చునేవాడినన్నాడు. 30 కప్పుల బ్లాక్‌ కాఫీ తాగి సిక్స్‌ ప్యాక్‌ మెయింటెన్‌ చేశానన్నాడు. అప్పట్లో ఈ కామెంట్లు తెగ వైరలయ్యాయి. ఇకపోతే షారూఖ్‌ ప్రస్తుతం కింగ్‌ అనే సినిమా చేస్తున్నాడు. సుజోయ్‌ ఘోష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అభిషేక్‌ బచ్చన్‌ విలన్‌గా కనిపించనున్నాడు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement