డ్రగ్స్‌ లిస్ట్‌లో అషూరెడ్డితో పాటు మరో సీనియర్‌ నటి కూడా.. | Senior Actress Phone Calls With Kp Chowdary | Sakshi
Sakshi News home page

KP Chowdary Drugs Case: డ్రగ్స్‌ లిస్ట్‌లో మరో సీనియర్‌ నటి

Jun 24 2023 8:40 AM | Updated on Jun 24 2023 9:13 AM

Senior Actress Phone Calls With Kp Chowdary - Sakshi

కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి అలియాస్‌ కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సెలబ్రిటీల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బిగ్‌ బాగ్‌ తెలుగు రియాల్టీ షో కంటెస్టెంట్‌ అషూరెడ్డితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు, వ్యాపార సంస్థల యజమానులకు కేపీ చౌదరి డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)

తాను మొత్తం 12 మందికి డ్రగ్స్ అమ్మినట్టు ఒప్పుకున్నాడు.  వివిధ ప్రాంతాలకు చెందిన బెజవాడ భరత్, వందనాల అనురూప, చింతా సాయి ప్రసన్న, చింతా రాకేష్‌ రోషన్, నల్లా రతన్‌ రెడ్డి, ఠాగోర్‌ విజ్‌ అలియాస్‌ ఠాగోర్‌ ప్రసాద్‌ మోటూరి, తేజ్‌ చౌదరి అలియాస్‌ రఘు తేజ, వంటేరు శవన్‌ రెడ్డి, సనా మిశ్రా, శ్వేత, సుశాంత్, నితినేష్‌ వీరిలో ఉన్నారు.  

అయితే అతను అషూరెడ్డితో పాటు మరో సీనియర్‌ ఆర్టిస్టుతో కూడా వందల ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినట్లు తెలుస్తోంది. కొంతమంది నటీమణులతో కేపీ చౌదరి కలిసి ఉన్న ఫోటోలు బయటకు రావడంతో వారు అలెర్ట్‌  అవుతున్నారని సమాచారం.

ఆ సీనియర్‌ నటి టాలీవుడ్‌లో చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడంతో.. ఆమెకు మంచి పాపులారిటీ ఉంది అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆమె ఎవరు అనే విషయాన్ని బయట పెట్టలేదు. కేవలం అషూరెడ్డి పేరును మాత్రమే పోలీసులు కస్టడీ రిపోర్టులో పొందుపరచారు. ఎదేమైన ఆ సీనియర్‌ నటి పేరు కూడా తెరపైకి రాక తప్పదని ప్రచారం జరుగుతుంది.

(ఇదీ చదవండి: ఇదే చివరి చిత్రమని ప్రకటించిన టాప్‌ హీరో.. నోటీసులు పంపిన నిర్మాత)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement