Samantha Ruth Prabhu Goes Bold In The Citadel Web Series Remake - Sakshi
Sakshi News home page

Samantha: మరోసారి బోల్డ్‌గా సమంత.. ప్రియాంక మాదిరే అలాంటి సీన్లలో నటిస్తుందా?

Apr 9 2023 10:56 AM | Updated on Apr 9 2023 11:59 AM

Samantha Goes Bold In The Citadel Web Series Remake - Sakshi

సమంత నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌-2’ ఎంత సూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే. ఈ సిరీస్‌లో రాజీగా డీగ్లామర్ పాత్రను పోషించిన సమంత తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుంది.అయితే సామ్‌ నటనపై కొంతమంది ప్రశంసలు కురిపిస్తే.. మరికొంతమంది విమర్శలు చేశారు. మరీ బోల్డ్‌గా నటించిందని ట్రోల్‌ చేశారు. కానీ చివరకు ఈ వెబ్‌ సిరీస్‌ సూపర్‌ హిట్‌ కొట్టి సామ్‌ని పాన్‌ ఇండియా హీరోయిన్‌గా చేసింది. ఇక ఇప్పుడు అంతకు మించిన బోల్డ్‌ సీన్లలో నటించానికి సామ్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘సీటాడెల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ ను తెరకెక్కించిన రాజ్-డీకే దర్శక ద్వయం ఈ సిరీస్ ఇండియా వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అమెజాన్‌ ఫ్రైమ్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో సమంతను మరింత బోల్డ్‌గా చూపించారనే టాక్‌ వినిపిస్తోంది. ఇటీవల ఈ వెబ్‌ సిరీస్‌ ఇంగ్లీష్‌ వెర్షన్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్‌లో హాట్‌ బెడ్‌ రూమ్‌ సీన్లను కూడా చూపించారు. ప్రియాంకను అర్థనగ్నంగా చూపించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక కూడా తాను ఈ సిరీస్‌లో బోల్డ్‌గా నటించానని చెప్పుకొచ్చింది.

అయితే ఇండియన్‌ వెర్షన్‌లో ప్రియాంక పోషించిన పాత్రలో సమంత నటిస్తోంది. సో.. ప్రియాంక మాదిరే సమంత కూడా అంతే బోల్డ్‌గా నటిస్తుందా లేదా డోస్‌ని తగ్గించి చూపిస్తారా? అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే వెంకటేశ్‌, రానా నటించిన ‘రానా నాయుడు’ బూతు సిరీస్‌గా పేరు తెచ్చుకుంది. విమర్శలు రావడంతో తెలుగు డబ్బింగ్‌ని తొలిగించారు. మరి సీటాడెల్‌లో సమంత బోల్డ్‌గా కనిపిస్తే ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement