సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'సిటాడెల్‌' రిలీజ్‌పై ప్రకటన | Samantha Ruth Prabhu And Varun Dhawan Web Series Citadel OTT Release Date Confirmed, Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Citadel OTT Release Date: సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌.. 'సిటాడెల్‌' రిలీజ్‌పై ప్రకటన

Aug 1 2024 3:22 PM | Updated on Aug 1 2024 3:52 PM

Samantha Citadel Streaming Date Locked

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత నటించిన సిటాడెల్‌ వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో రుస్సో బ్రదర్స్‌ దీనిని నిర్మిస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్‌, ఫర్జీ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్‌ అండ్‌ డీకే ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. ఇందులో సమంతతో పాటుగా వరుణ్‌ధావన్‌ నటిస్తున్నారు.  తాజాగా సిటాడెల్‌ స్ట్రీమింగ్‌ తేదీని అమెజాన్‌ ప్రేమ్‌ ప్రకటించింది.

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్‌ 7న విడుదల కానుందని అమెజాన్‌ ప్రకటించింది. ఈమేరకు టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఫ్యామిలీ మ్యాన్ 2 త‌ర్వాత స‌మంత న‌టించిన బాలీవుడ్ వెబ్‌సిరీస్ సిటాడెల్ కోసం అభిమానులు చాలా రోజులుగా ఆస‌క్తిగా ఎదురుచూస్తోన్నారు. ఈ సిరీస్‌లో స‌మంత స్పై పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

యాక్ష‌న్ సీన్స్‌లలో స‌మంత దుమ్మురేపిందని టాక్‌.  హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌  సిటాడెల్ వెబ్‌సిరీస్‌లో నటించారు.  ఇప్పుడు బాలీవుడ్‌లో స‌మంత‌, వ‌రుణ్ ధావ‌న్‌లతో తెరకెక్కించారు. అయితే, ఈ సిరీస్‌ కోసం ఎలాంటి డూప్‌ లేకుండానే యాక్షన్‌ సీన్స్‌లలో సమంత నటించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement