Samajavaragamana Movie Official OTT Release Date Confirmed - Sakshi
Sakshi News home page

Samajavaragamana OTT: సామజవరగమన ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది

Jul 21 2023 9:57 AM | Updated on Jul 21 2023 6:47 PM

Samajavaragamana Movie Aha Ott Official Release Date July 28 - Sakshi

శ్రీవిష్ణు, నరేశ్‌ తండ్రీకుమారులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘సామజవరగమన’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో రామ్‌ అబ్బరాజు దర్శకుడు. రెబా మోనికా జాన్‌ కథానాయిక. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వెన్నెల కిషోర్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రల్లో నటించారు.

(ఇదీ చదవండి: సినీ నటిపై రేప్‌.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు తీసుకెళ్లి ఆపై)

మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ మూవీ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన ఆహాలో జులై 28న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.  డిజిటల్‌ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ఆహా  ఈమేరకు అధికారికంగానే ప్రకటించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా జూన్‌ 29న విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్‌ టాక్‌ రావడంతో దాని బిజినెస్‌ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంత సూపర్‌ హిట్‌ అయిన సినిమాను జులై 28న 'ఆహా' ఓటీటీలో చూసేయండి.

Advertisement
 
Advertisement
Advertisement