నాగ్‌ సార్‌ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్‌ | Saiyami Kher Speech At Wild Dog Movie | Sakshi
Sakshi News home page

నాగ్‌ సార్‌ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్‌

Mar 28 2021 4:06 AM | Updated on Mar 30 2021 8:42 PM

Saiyami Kher Speech At Wild Dog Movie - Sakshi

అంత పెద్ద స్టార్‌తో కలిసి నటించేందుకు నేను మొదట నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన సెట్‌లో సరదాగా ఉంటారు

‘‘నా కెరీర్‌లో కొన్ని సినిమాల షూటింగ్స్‌ పూర్తి కావడానికి కాస్త ఎక్కువ టైమ్‌ పట్టింది. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇతర భాషల్లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చేశాను. ఈ కారణంగా తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను’’ అన్నారు హీరోయిన్‌  సయామీ ఖేర్‌. నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌  దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. ఏప్రిల్‌ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్‌ చెప్పిన విశేషాలు...

► ‘వైల్డ్‌ డాగ్‌’లో నేను ఆర్యా పండిట్‌ అనే ‘రా’ (రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) ఏజెంట్‌గా కనిపిస్తాను. ‘రా’ ఏజెంట్‌ అయిన నేను నాగ్‌ సార్‌ లీడ్‌ చేస్తున్న ‘ఎన్‌ఐఏ’ టీమ్‌లో ఎందుకు జాయిన్‌  కావాల్సి వచ్చిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

► నాగార్జున ‘శివ’ సినిమాతో ట్రెండ్‌ సెట్‌ చేశారు. కానీ ఆయన సినిమాల్లో నా ఫేవరెట్‌ ‘గీతాంజలి’ మూవీ. అంత పెద్ద స్టార్‌తో కలిసి నటించేందుకు నేను మొదట నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన సెట్‌లో సరదాగా ఉంటారు. ఓ సారి నాగ్‌ సార్‌ ఇంటి నుంచి బిర్యానీ తెస్తే, ఓ పట్టుపట్టాను.

► సాధారణంగా హీరోయిన్‌  పాత్రలకు పెద్దగా యాక్షన్‌  సీక్వెన్స్‌ ఉండవు. కానీ ఈ సినిమాలో నాకు చాలా యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉంటాయి. నాగ్‌ సార్‌తోనూ ఛేజింగ్‌ యాక్షన్‌  సీక్వెన్స్‌ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఫిట్‌గా ఉంటాను. ఆ ఫిట్‌నెస్‌ నాకు ఈ సినిమాలో యాక్షన్‌  సీక్వెన్స్‌ లు చేసేందుకు ఉపయోగపడింది. ఈ సినిమా కోసం మార్షల్స్‌ ఆర్ట్స్‌లో నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.

► ప్రతి యాక్టర్‌కూ కొందరితో వర్క్‌ చేయాలని ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్‌  నా ఫేవరెట్స్‌. వారితో సినిమాలు చేయాలని ఉంది. అలాగే డైరెక్టర్స్‌లో మణిరత్నం, రాజమౌళిగారు అంటే నాకు ఇష్టం. ప్రస్తుతం రెండు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను.

Advertisement
 
Advertisement
Advertisement