ఆర్‌ఆర్‌ఆర్‌ ఆరంభం | RRR Movie to resume the shooting | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ ఆరంభం

Oct 5 2020 12:34 AM | Updated on Oct 5 2020 12:34 AM

RRR Movie to resume the shooting - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం). సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో కొమురమ్‌ భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్, రామ్‌చరణ్‌కి జోడీగా హిందీ నటి ఆలియా భట్‌ కనిపించనున్నారు.

శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏడు నెలల కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ నేటి నుంచి (అక్టోబర్‌ 5) హైదరాబాద్‌లో జరగనుంది. షూటింగ్‌లో పాల్గొనే ముఖ్య నటీనటులందరూ కొన్ని రోజులుగా స్వీయ క్వారంటైన్‌లో ఉన్నారని సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్‌ కుమార్‌ కెమెరామేన్‌.

Advertisement
 
Advertisement
Advertisement