RRR Movie: Komuram Bheemudo (Telugu) Full Video Song - Sakshi
Sakshi News home page

Komuram Bheemudo Song: కొమురం భీముడో ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది

May 6 2022 4:51 PM | Updated on May 7 2022 1:17 PM

RRR Movie: Komuram Bheemudo Full Video Song Out Now - Sakshi

ఆయనలో సంగీతం అందించిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంలా జనాలను హత్తుకుంది. రామరాజు చేతిలో కొమురం భీమ్‌ దెబ్బలు తినే సమయంలో వచ్చే కొమురం భీముడో పాట ప్రేక్షకుల హృదయాలను కదిలించక మానదు.

ఆర్‌ఆర్‌ఆర్‌... ఈ సినిమా కథ, కంటెంట్‌, స్టార్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా ప్రతీదీ మూవీని ఒక్కో మెట్టు పైకి ఎక్కించిందే! రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రెపరెపలాడించింది. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీముడిగా, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందించాడు. ఆయనలో సంగీతం అందించిన ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంలా జనాలను హత్తుకుంది. రామరాజు చేతిలో కొమురం భీమ్‌ దెబ్బలు తినే సమయంలో వచ్చే కొమురం భీముడో పాట ప్రేక్షకుల హృదయాలను కదిలించకమానదు.

ఈరోజు సాయంత్రం కొమురం భీముడో.. కొమురం భీముడో.. అంటూ సాగే పాట ఫుల్‌ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సుద్దా అశోక్‌ తేజ రాసిన లిరిక్స్‌ తూటాల్లా పేలగా కాల భైరవ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశాడు. ప్రస్తుతం ఈ సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: సౌత్‌ రీమేక్స్‌ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement