అది నా అదృష్టం: రీతూ వర్మ | Ritu Varma about Devika and Danny | Sakshi
Sakshi News home page

అది నా అదృష్టం: రీతూ వర్మ

Jun 4 2025 12:05 AM | Updated on Jun 4 2025 12:05 AM

Ritu Varma about Devika and Danny

‘‘చాలా మంది అమ్మాయిలను చుట్టు పక్కల ఉండేవాళ్లు ‘నువ్వు అది చేయలేవు.. ఇది చేయలేవు’ అంటూ నిరుత్సాహపరుస్తుంటారు. అలాంటి వారికి ‘దేవిక అండ్‌ డానీ’ సిరీస్‌ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. ఇటువంటి నిజాయితీతో కూడిన కథ నా దగ్గరకు రావడం, నేను చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్‌ రీతూ వర్మ తెలిపారు.

శివ కందుకూరి, రీతూ వర్మ, సూర్య వశిష్ఠ్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో బి. కిశోర్‌ దర్శకత్వం వహించిన వెబ్‌ సిరీస్‌ ‘దేవిక అండ్‌ డానీ’. సుధాకర్‌ చాగంటి నిర్మించిన ఈ సిరీస్‌ ఈ నెల 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘ఈ సిరీస్‌లో నేను సుబ్బు అనే ఫన్నీ పాత్ర చేశాను’’ అన్నారు.

‘‘దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బులాంటి పాత్రలు ఎలా మార్చాయనేది ఈ సిరీస్‌లో చూడొచ్చు’’ అని పేర్కొన్నారు సూర్య వశిష్ఠ్‌. ‘‘దేవిక అండ్‌ డానీ’లో ఏడు ఎపిసోడ్స్‌ ఉంటాయి. ఎంటర్‌టైన్మెంట్, ఎమోషన్స్‌ సహా అన్ని అంశాలున్న సిరీస్‌ ఇది’’ అని సుధాకర్‌ చాగంటి తెలిపారు. ‘‘శ్రీకారం’ సినిమా తర్వాత ఈ సిరీస్‌ చేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ సిరీస్‌ చూసే ఆడియన్స్‌ సమయం వృథా కాదు’’ అన్నారు బి. కిశోర్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement