పువ్వులు... కొన్ని చిరునవ్వులు | Rashmika shared pictures on Social media from her birthday celebrations | Sakshi
Sakshi News home page

పువ్వులు... కొన్ని చిరునవ్వులు

Apr 13 2025 4:38 AM | Updated on Apr 13 2025 4:38 AM

Rashmika shared pictures on Social media from her birthday celebrations

బుంగమూతి పెట్టుకుని ఓ ఫొటో, చిరునవ్వులు చిందిస్తూ మరో ఫొటో, ఏదో ఆలోచిస్తూ ఎటో చూస్తున్నట్లు ఓ ఫొటో... ఇలా రష్మికా మందన్నా తన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఈ బ్యూటీ ఇటీవల వెకేషన్‌ కోసం ఒమన్‌ వెళ్లారు. అక్కడ బీచ్‌లో ఎంజాయ్‌ చేయడం, సూర్యాస్తమయాన్ని ఆస్వాదించడం... ఇలా రొటీన్‌కి భిన్నంగా టైమ్‌ స్పెండ్‌ చేశారామె. ఈ నెల 5న తన పుట్టినరోజుని కూడా అక్కడే జరుపుకున్నారు.

‘బీచ్‌... ఇసుక, సన్‌ సెట్, పువ్వులు (పూల తోట నుంచి ఉద్దేశించి ఆయ్యుండొచ్చు), కొన్ని చిరునవ్వులు... ఇంకా మీ ప్రేమ’ అంటూ పోస్ట్‌ చేశారు. ఒమన్‌లో గడిపిన వెకేషన్‌కి సంబంధించిన ఫొటోలు షేర్‌ చేశారు. ఇక వెకేషన్‌ నుంచి వచ్చిన రష్మిక హిందీ చిత్రం ‘థామా’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ హారర్‌ మూవీలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement