నా కంటే అందమైన వాళ్లున్నారు.. కానీ: రష్మిక ఆసక్తికర కామెంట్స్ | Rashmika Mandanna Open About Her Career Success | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఆ విషయం నాకు కూడా తెలుసు: రష్మిక

Apr 14 2024 7:55 AM | Updated on Apr 14 2024 8:20 AM

Rashmika Open About Her Career Success In recent Interview - Sakshi

నేషనల్ క్రష్‌  రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది యానిమల్‌ మూవీతో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. అంతే కాదు భారతీయ సినిమాలోనే అత్యధికంగా అభిమానులను అలరించిన నటిగానూ మొదటి స్థానంలో ఉన్నారు. రష్మిక పలు భాషలు, పలు చిత్రాల్లో నటించినా తెలుగు చిత్రం పుష్ప ఈమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. ఈ చిత్రం తరువాతనే బాలీవుడ్‌ ఎంట్రీ యానియల్‌ సినిమాతో హిట్ కొట్టింది.

కాగా ఇటీవల రష్మిక మందన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకంటే అందం, ప్రతిభ కలిగిన అమ్మాయిలు చాలా మంది ఉన్నారన్నది తనకు తెలుసన్నారు. అయితే తనకు మంచి అవకాశాలు రావడంతో ఆ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. ఇందుకు తాను నిజంగా కృతజ్ఞతురాలినై ఉంటానన్నారు. జీవితంలో సంతోషాన్ని, మీరు పొందిన విజయాన్ని సాధారణంగా భావించరాదన్నారు. గత కొద్ది కాలంగా తాను నేర్చుకున్నది ఇదేనని నటి రష్మిక మందన్నా పేర్కొన్నారు.

కాగా ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ పుష్ప -2: ది రూల్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన పాన్‌ ఇండియా స్థాయిలో తెరపైకి రానుంది. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత చావ అనే ఒక హిందీ చిత్రం, రెయిన్‌బో అనే ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు), ది గర్ల్‌ ఫ్రెండ్‌ అనే తెలుగు చిత్రం రష్మిక చేతిలో ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement