‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి సాంగ్‌ విడుదల.. ఫ్యాన్స్‌ ఫిదా | Ram Pothineni Double Ismart Song Out Now | Sakshi
Sakshi News home page

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి సాంగ్‌ విడుదల.. ఫ్యాన్స్‌ ఫిదా

Jul 1 2024 4:26 PM | Updated on Jul 1 2024 5:19 PM

Ram Pothineni Double Ismart Song Out Now

హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' (2019) కి సీక్వెల్‌గా 'డబుల్‌ ఇస్మార్ట్‌' రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి  ‘స్టెప్‌ మార్‌’ అంటూ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించే లిరికల్‌ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. రి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తుంటే.. సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నారు.

మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమా ఆగష్టు 15న  విడుదల కానుంది. మణిశర్మ సంగీతం  ఈ మూవీకి ప్రధాన బలం కానుంది. పార్ట్‌-1 కోసం ఆయన అందించిన మ్యూజిక్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సీక్వెల్‌లో కూడా ఆయన దుమ్మురేపాడని తెలుస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మా సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement