లవ్‌ నుంచి థ్రిల్‌ | ram karthik about veekshanam movie | Sakshi
Sakshi News home page

లవ్‌ నుంచి థ్రిల్‌

Oct 16 2024 12:08 AM | Updated on Oct 16 2024 12:08 AM

ram karthik about veekshanam movie

‘‘నేను గతంలో థ్రిల్లర్‌ సినిమాలు చేశాను. కానీ ‘వీక్షణం’ లాంటి మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. సరదాగా ఉండే కుర్రాడికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఆ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడంతో అతని కథ ఎలాంటి మలుపులు తిరగుతుంది?’’ అన్నది ‘వీక్షణం’లో ఆసక్తిగా ఉంటుంది’’ అని హీరో రామ్‌ కార్తీక్‌ అన్నారు.

మనోజ్‌ పల్లేటి దర్శకత్వంలో రామ్‌ కార్తీక్, కశ్వి జంటగా నటించిన సినిమా ‘వీక్షణం’. పి. పద్మనాభ రెడ్డి, అశోక్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్‌ కార్తీక్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లవ్‌ స్టోరీతోప్రారంభమై మిస్టరీ థ్రిల్లర్‌గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్‌ని ఎవరూ ఊహించలేరు. 

ఫస్ట్‌ కాపీ చూసినవారు నా గత సినిమాలతో పోలిస్తే ఇందులో మెచ్యూర్డ్‌గా, సెటిల్డ్‌గా నటించానని అనడం సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన వాటిలో ‘తెలిసినవాళ్లు, గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. ‘వీక్షణం’ చిత్రం హీరోగా నన్ను మరో మెట్టుపైకి తీసుకెళుతుందని ఆశిస్తున్నాను. వాసూగారి దర్శకత్వంలో నేను చేసిన సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement