కొత్త డైరెక్టర్స్‌కు వర్మ పరీక్ష.. ఎంపికైన వారి లిస్ట్‌ ఇదే | Ram Gopal Varma New Directors Elected List | Sakshi
Sakshi News home page

కొత్త డైరెక్టర్స్‌కు వర్మ పరీక్ష.. ఎంపికైన వారి లిస్ట్‌ ఇదే

Jun 10 2024 2:15 PM | Updated on Jun 10 2024 2:38 PM

Ram Gopal Varma New Directors Elected List

టాలీవుడ్‌ సెన్సేషనల్ డైరెక్టర్  రామ్ గోపాల్ వర్మ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లో RGV డెన్‌ను నిర్మించారు. అక్కడి నుంచే సినిమా కార్యక్రమాలను ఆయన చూస్తూ ఉంటారు. అయితే కొద్దిరోజుల క్రితం ఆయన డెన్‌ నుంచి ఒక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చాలామందికి కోరిక ఉంటుంది. అలాంటి వారికి ఆర్జీవీ డెన్‌ గతంలోనే ఒక ప్రకటన జారీ చేసింది. ఇందులో ఆసక్తి ఉన్న  డైరెక్టర్స్,రైటర్స్, మ్యూజిక్ కంపోజర్స్ కావాలంటూ వర్మ ట్వీట్ ద్వారా  తెలిపారు. అయితే తాజాగా వర్మ తన డెన్‌లోకి అడుగుబెట్టబోయే వారి లిస్ట్‌ను ప్రకటించారు.

డైరెక్టర్స్‌గా వర్మ డెన్‌లో అడుగుబెట్టాలని 419 మంది  తన వెబ్‌సైట్‌ (https://rgvden.com/) ద్వారా నమోదు చేసుకుంటే అందులో 11 మందిని సెలక్ట్‌ చేసి వారి పేర్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీరందరూ జూన్‌ 14న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌కు రావాలని ఆయన తెలిపారు. ఇదే క్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్స్‌గా 9మంది ఎంపికయ్యారని చెప్పారు. అయితే, వీరిలో ఒక్కరు మాత్రమే ఫైనల్‌ అవుతారని, వారిని కూడా ఎలా ఎంపిక చేస్తారు అనేది వెబ్‌సైట్‌లో తెలిపారు. వర్మ డెన్‌కు ఎంపిక అయిన వారందరీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను కూడా వారి పేరు పక్కన చేర్చడం విశేషం. వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌లో https://rgvden.com/ చూడగలరు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement