రక్షిత్‌ అట్లూరి హీరోగా కొత్త చిత్రం​ ప్రారంభం | Rakshit Atluri Started Shooting For Police Station Private Limited | Sakshi
Sakshi News home page

Rakshit Atluri : రక్షిత్‌ అట్లూరి హీరోగా కొత్త చిత్రం​ ప్రారంభం

Mar 27 2023 3:11 PM | Updated on Mar 27 2023 3:13 PM

Rakshit Atluri Started Shooting For Police Station Private Limited - Sakshi

రక్షిత్‌ అట్లూరి హీరోగా గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో ‘పోలీస్‌ స్టేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ’ అనే సినిమా షురూ అయింది. విశ్వేశ్వర శర్మ, రాజరాయ్‌ నిర్మిస్తున్న ఈ మూవీ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సీన్‌కి నిర్మాత ప్రసన్న కుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ చందు మొండేటి క్లాప్‌ కొట్టారు.అనంతరం గొల్లపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, యాక్షన్‌ డ్రామా, పోలీస్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు.

‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు రక్షిత్‌. ‘‘మా సినిమాలో నటించే ఇతర నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణల వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు విశ్వేశ్వర శర్మ. 

Advertisement
 
Advertisement
Advertisement