నటుడికి ప్లాస్టిక్‌ సర్జరీ? ఏడేళ్ల క్రితమే.. | Rajkummar Rao Breaks Silence on Plastic Surgery Rumours | Sakshi
Sakshi News home page

Rajkummar Rao: ప్లాస్టిక్‌ సర్జరీ.. ఏడేళ్ల క్రితం అలా చేశానన్న నటుడు

Apr 19 2024 8:08 PM | Updated on Apr 19 2024 9:21 PM

Rajkummar Rao Breaks Silence on Plastic Surgery Rumours - Sakshi

ఆ ఫోటో అస్సలు బాలేదు. మేకప్‌ లేనందువల్ల మీకలా అనిపించిందంతే! నాక్కూడా ఆ లుక్‌ కాస్త వింతగానే అనిపించింది. దాన్ని కెమెరాల్లో బంధించి వైరల్‌ చేసేశారు. కాకపో

సెలబ్రిటీలు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నారని ఫిల్మీదునియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా ఈ రూమర్స్‌ తప్పవు. బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు కూడా తన దవడకు ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నాడని ఈ మధ్య పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో సదరు నటుడు స్పందిస్తూ.. తను ఎటువంటి సర్జరీ చేయించుకోలేదని ఊహాగానాలకు ముగింపు పలికాడు.

మేకప్‌ లేకపోవడం వల్ల..
గతంలో తన వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు చిన్‌పై ఫిల్లర్స్‌ మాత్రమే వేయించుకున్నానన్నాడు. ఇంకా మాట్లాడుతూ.. 'ఆ ఫోటో అస్సలు బాలేదు. మేకప్‌ లేనందువల్ల మీకలా అనిపించిందంతే! నాక్కూడా ఆ లుక్‌ కాస్త వింతగానే అనిపించింది. దాన్ని కెమెరాల్లో బంధించి వైరల్‌ చేసేశారు. కాకపోతే ఎనిమిదేళ్ల క్రితం నా పర్సనల్‌ డాక్టర్‌ చెప్పినదాని ప్రకారం.. మరింత కాన్ఫిడెంట్‌గా కనిపించేందుకు ఫిల్లర్‌ ట్రై చేశాను. మేము కెమెరాముందు అందంగా కనిపించాలి.

ప్లాస్టిక్‌ సర్జరీ చాలా కాస్ట్‌లీ
కాబట్టి ఇది తప్పేం కాదు. మన ఆత్మస్థైరాన్ని మరింత పెంపొందిస్తుందనేవాటికి ఎందుకు నో చెప్పడం? నేను ఏదైనా ఓపెన్‌గా చెప్పేస్తుంటాను. ప్లాస్టిక్‌ సర్జరీ అనేది చాలా ఖరీదైన వైద్యం.. ఎంతో టైం పడుతుంది కూడా! నేను దాని జోలికి వెళ్లలేదు' అని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం రాజ్‌కుమార్‌ రావు అంధుడు శ్రీకాంత్‌ బొల్ల బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 10న విడుదల కానుంది.

చదవండి: 'ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..' అక్కర్లేదంటూ సందీప్‌ కౌంటర్‌

Advertisement
 
Advertisement
Advertisement