బెంగాల్‌లో తగ్గేదే లే! | Pushpa 2 Breaks Records with Over Rs 50 Crore Box Office Collection in Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో తగ్గేదే లే!

Jan 5 2025 2:30 AM | Updated on Jan 5 2025 2:30 AM

Pushpa 2 Breaks Records with Over Rs 50 Crore Box Office Collection in Bengal

‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్‌ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్‌కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్‌ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్‌లో ఈ చిత్రం ఓ రికార్డ్‌ సాధించింది.

మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్‌ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్‌ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్‌లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్‌ ఓబిజాన్‌’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్‌ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్‌ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్‌ చేసింది. ఒక డబ్బింగ్‌ సినిమా ఇలా ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్‌ ఫైర్‌.... లోకల్‌ కాదు... ఇంటర్నేషనల్‌.

Advertisement
 
Advertisement
Advertisement