ప్రియదర్శి కొత్త మూవీ.. టాలీవుడ్‌లోకి సోషల్‌ మీడియా సెన్సేషన్‌! | Priyadarshi's Mithra Mandali Movie Poster Out: Niharika NM Debut | Sakshi
Sakshi News home page

ప్రియదర్శి కొత్త మూవీ.. మ్యాడ్‌నెస్‌ ఇప్పుడే మొదలైంది

Jun 6 2025 1:31 PM | Updated on Jun 6 2025 1:46 PM

Priyadarshi's Mithra Mandali Movie Poster Out: Niharika NM Debut

హీరో ప్రియదర్శి, 'మ్యాడ్' ఫేమ్ విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మిత్ర మండలి. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో నీలిరంగు ముసుగుల వెనక ఓ గ్యాంగ్‌ అందర్నీ నవ్వించేందుకు రెడీగా ఉంది. అంతేకాదు, ఈ పోస్టర్‌లో సోషల్‌ మీడియా సంచలనం నిహారిక ఎన్‌.ఎం. ఉండటం విశేషం.

హాలీవుడ్‌ హీరోతో పనిచేసిన సెన్సేషనల్‌ బ్యూటీ
సోషల్ మీడియా ద్వారా వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన నిహారిక.. ఇటీవల 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' కోసం టామ్ క్రూజ్‌తో కలిసి పనిచేసి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మిత్రమండలి చిత్రంతో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తోంది. విజయేందర్ ఎస్ నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు తాను నూతనంగా ప్రారంభించిన బి.వి. వర్క్స్ పతాకంపై 'మిత్ర మండలి' చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. 

మ్యాడ్‌నెస్‌ మొదలైంది
ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే వ్యవహరిస్తున్నారు. 'మిత్ర మండలి' అనేది స్నేహం ప్రధానంగా నడిచే కథ. ఇది ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుంది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో మ్యాడ్ నెస్ ఇప్పుడే మొదలైందని చెప్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చదవండి: మళ్లీ అవే డిమాండ్లు! కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లో దీపిక లేనట్లేనా?

Advertisement
 
Advertisement
Advertisement