'కల్కి' రెండో రోజు కలెక్షన్స్.. కాస్త తగ్గాయి కానీ! | Prabhas Kalki 2898 AD Day 2 Collection WorldWide | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD Collection: రెండు రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లు వచ్చాయంటే?

Jun 29 2024 1:59 PM | Updated on Jun 29 2024 3:26 PM

Prabhas Kalki 2898 AD Day 2 Collection WorldWide

బాక్సాఫీస్ దగ్గర 'కల్కి 2898' జోరు మామూలుగా లేదు. తొలిరోజే రూ.191 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. కాకపోతే కాస్త తగ్గుదల చూపించింది. త్రిబుల్ సెంచరీ కొద్దిలో మిస్ అయింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.

(ఇదీ చదవండి: 'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్)

టాలీవుడ్‌లోనే భారీ బడ్జెట్‌తో తీసిన 'కల్కి'.. రెండు రోజుల క్రితం థియేటర్లలోకి వచ్చింది. పాజిటివ్ టాక్ తెచ్చుకుని దూసుకుపోతోంది. ఇప్పటికే ఓవర్సీస్‌లో 7 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.191.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా.. రెండో రోజు రూ.107 కోట్లు సొంతం చేసుకుంది.

తద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పోస్టర్ రిలీజ్ చేసింది. దీని బట్టి చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి ఎంత? లాంగ్ రన్‌లో ఎంత కలెక్ట్ చేస్తుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసేస్తున్నారు.

(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే)

Advertisement
 
Advertisement
Advertisement