Prabhas Adipurush Update: Adhipurush Movie Shooting Will Starts On Tuesday, Adipurush Movie Cast - Sakshi
Sakshi News home page

ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ మొదలైంది..

Feb 2 2021 10:01 AM | Updated on Feb 2 2021 2:41 PM

Prabhas adipurush Movie Shooting Started On Tuesday - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తన అభిమానులకు గుడ్‌ న్యూస్‌ అందించాడు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'ఆదిపురుష్' షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన డార్లింగ్‌.. టైటిల్ లోగోతో కూడిన 'ఆదిపురుష్' ఆరంభ్ అనే సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ రోజు (మంగళవారం) ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. ఇక తమ హీరో సినిమా నుంచి అప్‌డేట్‌ అందించి సర్‌ప్రైజ్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఖుషీగా ఫీల్‌ అవుతున్నారు. కాగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న  చిత్రం 'ఆదిపురుష్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా పౌరాణిక గాథ రామాయణం ఆధారంగా రూపొందుతోంది. ఆదిపురుష్‌లో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. రావణుడిగా బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటించనున్నాడు. చదవండి: రాముడి తల్లిగా  హేమ మాలిని?

అంతేగాక సీతగా కృతీ సనన్‌ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఐదు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్‌ 11న విడుదల చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను మెల్లమెల్లగా పట్టాలెక్కిస్తున్నాడు. ఆయన నటిస్తున్న 'రాధేశ్యామ్' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో నెక్ట్స్‌ మూవీపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే 'సలార్' సెట్స్ మీదకు రాగా.. తాజాగా మరో బిగ్గెస్ట్ మూవీ ఆదిపురుష్ కూడా ప్రారంభించేశాడు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement