ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్‌.. నటుడి కామెంట్లు | Nithya Menen Fear Her Marriage | Sakshi
Sakshi News home page

ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్‌.. నటుడి కామెంట్లు

Oct 19 2023 7:11 PM | Updated on Oct 19 2023 9:09 PM

Nithya Menen Fear Her Marriage - Sakshi

సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు ఉన్న మలయాళ కుట్టి నిత్యా మేనన్‌ సింగర్‌గా, హీరోయిన్‌ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ నిత్యామీనన్ పెళ్లి గురించి ఏడాది నుంచి పలు రూమర్లు వస్తూనే ఉన్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ స్టార్‌ హీరోను నిత్యా మేనన్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియాలో కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. వాటిలో ఏలాంటి నిజం లేదని చెప్పింది ఈ బ్యూటీ.

(ఇదీ చదవండి: ఫోన్‌ ఇచ్చేస్తా అంటూ హీరోయిన్‌కు కండీషన్‌ పెట్టిన అజ్ఞాతవాసి)

సౌత్‌ ఇండియాలో విభిన్నమైన నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా పెళ్లి గురించి తమిళ నటుడు, సినీ విమర్శకుడు బైల్వాన్‌ రంగనాథన్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ప్రముఖ మలయాళ నటి పెళ్లి చేసుకున్న తర్వాత వరకట్నం, గృహహింస వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకుందని.. ఈ భయమే నిత్యా మేనన్‌ను వెంటాడుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమె ఇంట్లోని వారందరూ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఈ బలమైన కారణం వల్ల ఆమె పెళ్లికి నో చెబుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

పెళ్లి చేసుకుంటే తాను కూడా గృహహింస భారిన పడాల్సి వస్తుందని ఆమె భావిస్తోందని చెప్పాడు. ఆమె అధిక బరువు కారణంగా కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నట్లు రంగనాథన్‌ తెలిపాడు. కానీ ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తాజాగా నిత్యా మీనన్‌ 'కుమారి శ్రీమతి' అనే వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్‌తో దూసుకుపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement