తెలుగు ఇండ‌స్ట్రీపై సెటైర్లు, ఆ హీరో త‌లెక్క‌డ పెట్టుకుంటాడో? | Netizens Compare John Abraham Attack Movie and RRR Movie Collections | Sakshi
Sakshi News home page

RRR Vs Attack: జాన్ అబ్ర‌హం సినిమాపై ఆర్ఆర్ఆర్ 'ఎటాక్‌'

Apr 2 2022 2:21 PM | Updated on Apr 2 2022 2:32 PM

Netizens Compare John Abraham Attack Movie and RRR Movie Collections - Sakshi

జాన్ అబ్ర‌హాం సినిమా ప్ర‌మోష‌న్స్‌లో తెలుగు సినిమా స్థాయిని కించ‌ప‌రుస్తూ మాట్లాడిన విష‌యం తెలిసిందే! తానో హిందీ హీరోన‌ని, తెలుగుతో పాటు ఎటువంటి ప్రాంతీయ సినిమాలో న‌టించ‌బోన‌ని తేల్చి చెప్పాడు. డ‌బ్బుల కోసం వేరే తెలుగు సినిమా చేయ‌న‌ని దురుసుగా వ్యాఖ్యానించాడు.

పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ బ్రేకుల్లేని బుల్డోజ‌ర్‌లా రికార్డుల‌ను తొక్కుకుంటూ పోతోంది. బాక్సాఫీస్ మీద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న ఈ చిత్రం హిందీలోనూ మంచి వ‌సూళ్లు రాబ‌డుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఏప్రిల్ 1న హిందీ హీరో జాన్ అబ్ర‌హాం మూవీ ఎటాక్ రిలీజ‌వ‌గా దానికంటే నాలుగు రెట్లు ఎక్కువే రాబ‌డుతూ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ క్ర‌మంలో ప‌లువురు ఎటాక్ సినిమాపై, జాన్ అబ్ర‌హంపై సెటైర్లు విసురుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

జాన్ అబ్ర‌హాం ఎటాక్ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో తెలుగు సినిమా స్థాయిని కించ‌ప‌రుస్తూ మాట్లాడిన విష‌యం తెలిసిందే! తానో హిందీ హీరోన‌ని, తెలుగుతో పాటు ఎటువంటి ప్రాంతీయ సినిమాలో న‌టించ‌బోన‌ని తేల్చి చెప్పాడు. డ‌బ్బుల కోసం వేరే తెలుగు సినిమా చేయ‌న‌ని దురుసుగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య‌ల‌పై సినీప్రియులు భ‌గ్గుమ‌న్నారు. తాజాగా ఎటాక్ సినిమా వసూళ్ల‌ను, ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్ల‌తో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ రెండో శుక్ర‌వారం కూడా రూ.13 కోట్లు సాధిస్తే ఎటాక్ తొలి రోజు కేవ‌లం మూడు కోట్లు మాత్ర‌మే రాబ‌ట్టింది, మ‌రిప్పుడు జాన్ అబ్ర‌హం త‌లెక్క‌డ పెట్టుకుంటాడో!' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చ‌ద‌వండి: బ్రేకప్‌ చెప్పుకున్న ప్రేమజంట, కారణమే విడ్డూరంగా ఉంది!

Advertisement
 
Advertisement
Advertisement