ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు | Nenu Student Sir Movie Updates | Sakshi
Sakshi News home page

ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు

Jun 2 2023 12:22 AM | Updated on Jun 2 2023 12:22 AM

Nenu Student Sir Movie Updates - Sakshi

రాకేష్, బెల్లంకొండ గణేశ్, çసతీష్‌ వర్మ

‘‘నేను స్టూడెంట్‌ సర్‌’లోని ఎమోషన్స్‌కు ఎక్కువగా స్టూడెంట్స్, యూత్‌ కనెక్ట్‌ అవు తారు. స్క్రీన్‌ ప్లే క్యూరియాసిటీతో నడుస్తుంది. ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు’’ అన్నారు బెల్లంకొండ గణేశ్‌. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’.

‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజవుతోంది. ఈ సందర్భంగా.. ‘‘ప్రేక్షకుల టైమ్, డబ్బు వృథా కావు’’ అన్నారు రాకేష్‌. ‘‘థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు సతీష్‌ వర్మ. ‘‘డబ్బే ఒక ఐడియాలజీ అనేది ఈ సినిమా రూట్‌ కాన్సెప్ట్‌’’ అన్నారు ఈ చిత్రకథారచయిత కృష్ణ చైతన్య.

Advertisement
 
Advertisement
Advertisement