‘సినీబజార్’లో ‘నీ వెంటే నేను’ | Nee Vente Nenu Movie To Release on Digital Theatre | Sakshi
Sakshi News home page

‘సినీబజార్’లో ‘నీ వెంటే నేను’

Sep 21 2023 3:40 PM | Updated on Sep 21 2023 3:40 PM

Nee Vente Nenu Movie To Release on Digital Theatre - Sakshi

బాలు - స్నేహ హీరోహీరోయిన్లుగా పరిచమవుతున్న చిత్రం ‘నీ వెంటే నేను’. అన్వర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీవెంకట సుబ్బలక్ష్మి మూవీస్ పతాకంపై  వెంకట్రావు మోటుపల్లి నిర్మిస్తున్నారు. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ క్లీన్ లవబుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ‘సినీబజార్’అనే డిజిటల్ థియేటర్ లో అక్టోబర్ 6న  విడుదల కానుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత వెంకట్రావు, హీరో బాలు, హీరోయిన్ స్నేహ, సినీ బజార్ అధినేత రత్నపురి వెంకటేష్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ బజార్‌ సీఈఓ వెంకటేష్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. నీ వెంటే నేను" చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుండడం చాలా ఆనందంగా ఉంది. పైరసీకి ఎట్టి పరిస్థితుల్లో తావులేని విధంగా సినీ బజార్ ను తీర్చిదిద్ధాం" అన్నారు. "నీ వెంటే నేను" వంటి క్లీన్ ఎంటర్టైనర్ తో పరిచయం అవుతుండటం పట్ల హీరో బాలు, హీరోయిన్ స్నేహ సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement