ఓటీటీలో కాదు నేరుగా యూట్యూబ్‌లో రిలీజైన తెలుగు సినిమా | Natarajan Infinity Movie Telugu Version Direct Release Youtube | Sakshi
Sakshi News home page

డైరెక్ట్ యూట్యూబ్‌లో రిలీజైన 'మహారాజ' నటుడి డబ్బింగ్ మూవీ

Jul 12 2024 12:47 PM | Updated on Jul 12 2024 1:26 PM

Natarajan Infinity Movie Telugu Version Direct Release Youtube

ఓటీటీల వల్ల సినిమాలు చూడటం అనేది బాగా పెరిగిపోయింది. థియేటర్లలో కంటే మొబైల్స్‌లోనే ఎక్కువగా మూవీస్ చూస్తున్నారు. వీటిలో స్ట్రెయిట్ చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ఉంటున్నాయి. తాజాగా ఓ యాక్షన్ థ్రిల్లర్ తెలుగు డబ్బింగ్ మూవీని ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం)

కొన్ని రోజుల క్రితం విజయ్ సేతుపతి 'మహారాజ' థియేటర్లలో రిలీజైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి కూడా వచ్చేసింది. ఇదే మూవీలో పోలీస్ అధికారిగా చేసిన నటరాజన్ సుబ్రమణియమ్ అనే నటుడు.. స్వతహాగా సినిమాటోగ్రాఫర్. అప్పుడప్పుడు హీరోగా కూడా పలు సినిమాలు చేస్తుంటాడు. అలా చేసిన మూవీనే 'ఇన్ఫినిటీ'.

గతేడాది తమిళంలో రిలీజైన ఈ సినిమా రివ్యూలకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు దీని తెలుగు డబ్బింగ్ వెర్షన్‍‌ని నేరుగా యూట్యూబ్‌లో రిలీజ్ చేసి పడేశారు. బహుశా ఏ ఓటీటీ సంస్థ కూడా దీన్ని కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదేమో! ఏదైతేనేం ఏదైనా టైమ్ పాస్ థ్రిల్లర్ మూవీ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఇదిలా ఉండగా ఇందులో హీరోగా చేసిన నటరాజన్.. గతంలో తెలుగులో 'అఆ', 'ఛల్ మోహన్ రంగా' చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయడం విశేషం.

(ఇదీ చదవండి: ఫారెన్ ట్రిప్‌లో దోపిడికి గురైన ప్రముఖ నటి.. లక్షల డబ్బుతో పాటు)

Advertisement
 
Advertisement
Advertisement