'ప్రేమలు' హీరో బాక్సింగ్ సినిమా.. తెలుగు ట‍్రైలర్ రిలీజ్ | Naslen Gymkhana Movie Telugu Trailer | Sakshi
Sakshi News home page

Gymkhana Trailer Telugu: మలయాళంలో హిట్.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?

Apr 19 2025 5:39 PM | Updated on Apr 19 2025 5:47 PM

Naslen Gymkhana Movie Telugu Trailer

గతేడాది రిలీజైన మలయాళ డబ్బింగ్ సినిమా 'ప్రేమలు'.. తెలుగు ప్రేక్షకుల్ని కూడా బాగానే అలరించింది. ఇందులో హీరోగా చేసిన నస్లేన్ ఇప్పుడు మరో క్రేజీ మూవీతో టాలీవుడ్ లోకి రాబోతున్నాడు. ఆ చిత్ర ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నాన్న కల నెరవేర్చిన తెలుగు డైరెక్టర్.. కొత్త ఇల్లు)   

ఈ నెల 10న మలయాళంలో రిలీజైన 'జింఖానా' సినిమా హిట్ అయింది. మెగాస్టార్ మమ్ముట్టి 'బజూక'తో పోటిపడి మరీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ చిత్రాన్ని ఇప్పుడు ఏప్రిల్ 25న తెలుగులోనూ రిలీజ్ చేయబోతున్నారు.

ట్రైలర్ బట్టి చూస్తే.. అల్లెప్పీలో కొందరు ఆవారా కుర్రాళ్లు అనుకోకుండా బాక్సింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రారంభంలో కామెడీగానే ఉంటారు గానీ తర్వాత సీరియస్ బాక్సర్స్ అయిపోతారు. మరి చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది.

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)   

Advertisement
 
Advertisement
Advertisement