పహల్గాం ఘటన.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్‌ | Nabha Natesh Expressed Deep Sorrow Over Pahalgam Incident | Sakshi
Sakshi News home page

ఉగ్రదాడి.. ఆ రోజులన్నీ కళ్లముందు తిరిగాయి: నభా నటేష్‌

Apr 29 2025 5:24 PM | Updated on Apr 29 2025 6:13 PM

Nabha Natesh Expressed Deep Sorrow Over Pahalgam Incident

పహాల్గాంలో పర్యాటకులపై  ఉగ్రవాదులు జరిపిన దాడి తన మనసుకు ఎంతో బాధ కలిగించిందని చెప్పింది హీరోయిన్ నభా నటేష్. ఉగ్రదాడులు హేయమైన చర్య అని దేశమంతా బాధితులకు సంఘీభావంగా ఉంటామని నభా పేర్కొంది. అందమైన పహల్గాంలో తాను షూటింగ్ చేశానని, అందమైన అహ్లాదకరమైన ప్రదేశమని నభా నటేష్ తెలిపింది. పహాల్గాంలో షూటింగ్ చేసిన జ్ఞాపకాలను ఆమె షేర్ చేసుకుంది.

నభా నటేష్ స్పందిస్తూ - పహాల్గాం బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ నేను నటించిన డార్లింగ్ మూవీ షూటింగ్ చేశాం. చుట్టూ 5 కిలోమీటర్ల మేర అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపాం. భూతల స్వర్గమైన పహాల్గాంలో ఉగ్రదాడి జరపడం హేయమైన చర్య. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. 

ఇలాంటి దాడులు జరిగాక ఫిలింమేకర్స్ పహాల్గాం వెళ్లాలంటే ఆలోచిస్తారు. స్థానిక ప్రజలు చాలా మంచివారు, మా టీమ్ కు స్నేహితులుగా మారిపోయారు. పహాల్గాం దాడి ఘటన గురించి వినగానే నాకు అక్కడ షూటింగ్ చేసిన రోజులన్నీ కళ్లముందు తిరిగాయి. అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement