ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్‌ ఇంట విషాదం | Music Director Gopi Sundar Mother Passed Away | Sakshi
Sakshi News home page

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్‌ ఇంట విషాదం

Jan 30 2025 12:20 PM | Updated on Jan 30 2025 12:28 PM

Music Director Gopi Sundar Mother Passed Away

ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్‌(Gopi Sundar ) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి లివి సురేశ్‌ బాబు(65)( Livi Suresh Babu)కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె గురువారం కేరళలోని కూర్కెన్చెరిలోని తన అపార్టుమెంట్లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయంగా గోపీ సుందరే సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. తల్లి మరణ వార్తను తెలియజేస్తూ..  ‘అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. 

నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి’అంటూ ఎమోషనల్‌ నోట్‌ షేర్‌ చేశాడు. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకరా క్రిమేటోరియం వద్ద గోపీ సుందర్ తల్లి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

మలయాళంలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌
మలయాళం టాప్‌ సంగీత దర్శకుల్లో గోపి సుందర్‌ ఒకరు. మెలోడీస్‌కి కేరాఫ్‌ ఆయన. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ హోటల్’ తో సంగీత దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించారు.  ఆ తర్వాత ఎన్నో మలయాళ హిట్ సినిమాలకు సంగీతం అందించారు. గోపీ సుందర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ నచ్చి మన టాలీవుడ్‌ దర్శక నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేశారు.  ‘ది ఫ్యామిలీ స్టార్’, ‘18 పేజెస్’, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజిలీ, నిన్నుకోరి తదితర బ్లాక్‌ బస్టర్‌ సినిమాలకు ఆయన సంగీతం అందించాడు. 

Advertisement
 
Advertisement
Advertisement