హారర్‌ మూవీకి 'ఎ' సర్టిఫికెట్‌.. అప్పుడే రిలీజ్‌ | Munna Kasi Starrer C 202 Movie Get A Certificate | Sakshi
Sakshi News home page

హారర్‌ మూవీకి 'ఎ' సర్టిఫికెట్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Oct 16 2024 8:50 PM | Updated on Oct 17 2024 9:18 AM

Munna Kasi Starrer C 202 Movie Get A Certificate

మున్నా కాశీ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న హారర్‌ థ్రిల్లర్ చిత్రం 'సి 202'. తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ముఖ్య పాత్రల్లో నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కె ఎ నిర్మిస్తున్నాడు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీకి 'ఎ' సర్టిఫికెట్ వచ్చింది.

గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన బలం అని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది.

Advertisement
 
Advertisement
Advertisement