పెళ్లికి రావాలంటూ 'రజనీకాంత్‌'ను ఆహ్వానించిన హీరోయిన్‌ | Megha Akash Invite Rajinikanth To Attend Her Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి రావాలంటూ 'రజనీకాంత్‌'ను ఆహ్వానించిన హీరోయిన్‌

Aug 25 2024 12:55 PM | Updated on Aug 25 2024 1:17 PM

Megha Akash Invite Rajinikanth To Attend Her Marriage

మెఘా ఆకాశ్‌.. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచయమే..  2017లో నితిన్ నటించిన 'లై' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మేఘా ఆకాశ్ పలు సినిమాలతో మెప్పించింది. అయితే, 28 ఏళ్ల ఈ బ్యూటీ కొద్దిరోజుల్లో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే మెఘా ఆకాశ్‌ పెళ్లి గురించి పలుమార్లు రూమర్స్‌ వచ్చాయి. కానీ, ఈసారి వాటంన్నింటికీ చెక్‌ పెడుతూ రీసెంట్‌గా తన చిరకాల ప్రియుడు సాయివిష్ణుతో  ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది.  కేరళ జరిగిన ఈ కార్యక్రమం ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు ఆహ్వానం
మెఘా ఆకాశ్‌కు రజనీకాంత్‌ అంటే చాలా ఇష్టం.. పలు ఇంటర్వ్యూలలో ఆమె ఇదే విషయాన్ని పంచుకుంది. తాజాగా కుటుంబ సభ్యులతో పాటు ప్రియుడు సాయివిష్ణుతో తలైవా ఇంటికి చేరుకుని తమ వివాహానికి రావాలని ఆహ్వానం పలికింది. రజనీతో దిగిన ఫోటోలను కూడా మెఘా ఆకాశ్‌ షేర్‌ చేస్తూ.. 'అభిమానంతో తలైవాను ఆహ్వానించాం' అంటూ ఒక నోట్‌ రాసింది. అయితే, ఫోటోలో శుభలేఖ కనిపించలేదు.

మేఘా ఆకాశ్‌-సాయి విష్ణు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నారు. రీసెంట్‌గా వారిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో ఆమె పంచుకుంది. అయితే, మేఘా ఆకాష్ పెళ్లిపై ఒకప్పడు భారీగానే కోలీవుడ్‌లో  పుకార్ వచ్చాయి. ఒక దశలో తమిళ మీడియా ఆమెకు పెళ్లి కూడా చేసేసింది. కానీ, ఎప్పటికప్పుడు తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఖండిస్తూ వచ్చిన ఈ బ్యూటీ ఎట్టకేలకు తన ప్రియడితో త్వరలో ఏడడుగులు వేయనుంది. పెళ్లి తేదీ తెలియాల్సి ఉంది.

తాజాగా విజయ్‌ ఆంటోనీ నటించిన తుఫాన్‌ (తెలుగులో) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల పరంగా అవకాశాలు వచ్చినా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఆమె కెరియర్‌ అంత ఈజీగా ముందుకు సాగలేదు. తెలుగులో చివరిగా మను చరిత్రలో నటించిన ఈ బ్యూటీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా తను నటించే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement