వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి | Mega 156 With Mallidi Vassishta Announcement Pic Goes Viral, Know Deets About Mega 157 - Sakshi
Sakshi News home page

Chiranjeevi Mega 156 Update: వశిష్ట సినిమా విషయంలో షాకింగ్ న్యూస్ చెప్పిన చిరంజీవి

Oct 24 2023 7:44 AM | Updated on Oct 24 2023 8:16 AM

Mega 156 With Mallidi Vassishta Announcement - Sakshi

మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ భారీ డిజాస్టర్‌ తర్వాత రెండు చిత్రాలను ప్రకటించారు. ఇందులో మెగా 156 చిత్రాన్ని తన కుమార్తె సుష్మిత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్‌ చేశారు. మరోకటి మెగా 157 చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌లో బింబిసార డైరెక్టర్‌ వశిష్టతో స్కెచ్‌ వేశారు. కానీ ఇక్కడ చిరు చిన్న మార్పు చేశారు. మెగా 157వ చిత్రంపైనే ఆయన ఎక్కువ ఫోకస్‌ పెట్టారు. డైరెక్టర్‌ వశిష్ట కథ పట్ల ఆయనకు భారీ నమ్మకం ఏర్పడ్డాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో మెగా 156 చిత్రాన్ని వదిలేసి మెగా 157 ప్రాజెక్ట్‌పైనే ఆయన ఫోకస్‌ పెట్టారు. కాబట్టి ఇప్పుడు వశిష్ట డైరెక్ట్‌ చేస్తున్న సినిమానే ముందుగా విడుదలవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. అందులో భాగంగానే తాజాగా ఆ ప్రాజెక్ట్‌ను మెగా 156 అని ఒక పోస్టర్‌ను వశిష్ఠ షేర్‌ చేశారు. మెగాస్టార్‌-వశిష్ఠ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో సంగీత దర్శకుడిగా ఎమ్‌ఎమ్‌ కీరవాణి భాగమయ్యారు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్‌ అందిస్తుండగా  చోటా కె. నాయుడు కెమెరామెన్‌గా ఉన్నారు.

ఇక మెగా 156 గురించి మాట్లాడుకుంటే.. ఈ సినిమాకు సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని, త్వరలో  ఆ డైరెక్టర్‌ని చిరునే అధికారికంగా ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే దసరా రోజున అభిమానులకు షాకిచ్చే న్యూస్ చెప్పాడు చిరు. తన లైన్లో మెగా 156 లేదు అంటూ తెలిపాడు. మెగా 157 గా తెరకెక్కుతున్న వశిష్ట సినిమానే మెగా 156 గా మార్చినట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మెగా 156 పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement