ఉక్రెయిన్‌ బ్యూటీకి సుమతి శతకం బోధిస్తున్న శివ కార్తికేయన్‌ | Maria Ryaboshapka First Look Release From Siva Karthikeyan Prince Movie | Sakshi
Sakshi News home page

Shiva Karthikeyan-Prince Movie: హీరోయిన్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Jun 11 2022 9:24 AM | Updated on Jun 11 2022 9:24 AM

Maria Ryaboshapka First Look Release From Siva Karthikeyan Prince Movie - Sakshi

ఉక్రెయిన్‌ బ్యూటీ మరియ ర్యాబోషప్కకి సుమతీ శతకం బోధిస్తున్నారు హీరో శివ కార్తికేయన్‌. ‘జాతిరత్నాలు’ ఫేమ్‌ కేవీ అనుదీప్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్, ర్యాబోషప్క జంటగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్‌’. సోనాలీ నారంగ్‌ సమర్పణలో సునీల్‌ నారంగ్, డి.సురేశ్‌బాబు, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలోని ర్యాబోషప్క ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. తన ప్రేయసి ర్యాబోషప్కకి ప్రిన్స్‌ హ్యాపీగా సుమతీ శతకం బోధిస్తున్నట్లుగా పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న థియేటర్స్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement