'లక్కీ భాస్కర్' కలెక్షన్.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే? | Lucky Baskhar Movie Day 2 Collection Worldwide | Sakshi
Sakshi News home page

Lucky Baskhar Day 2 Collection: స్టడీగా వసూళ్లు.. తొలిరోజు కంటే కాస్త బెటర్

Nov 2 2024 9:53 AM | Updated on Nov 2 2024 10:15 AM

Lucky Baskhar Movie Day 2 Collection Worldwide

దీపావళికి తెలుగు రాష్ట్రాల్లో రిలీజైన సినిమాల్లో 'లక్కీ భాస్కర్' జోరు చూపిస్తోంది. మిగిలిన మూవీస్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ దుల్కర్ చిత్రానికి ఆడియెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ చూస్తే అదే నిజమనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)

'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. బ్యాంకింగ్ రంగంలోని మోసాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ తీసిన ఈ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. దీంతో తొలి రోజు రూ.12.7 కోట్లు గ్రాస్ రాగా, రెండో రోజు కూడా అంతే స్టడీగా వచ్చాయి. కాస్త రూ.13.5 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజుల్లో రూ.26.2 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.

దుల్కర్‪‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. వెంకీ అట్లూరి రచన-దర్శకత్వం ఒకెత్తయితే, జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం మరో ఎత్తు. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర 'లక్కీ భాస్కర్' నెమ్మదిగా పికప్ అవుతోంది. ఈ వీకెండ్ ముగిసేసరికి రూ.50 కోట్ల వసూళ్లు మార్క్ చేరుకుంటుదేమో చూద్దాం!

(ఇదీ చదవండి: దీపావళికి నాలుగు కొత్త సినిమాలు.. ఏది ఎలా ఉందంటే?)

Advertisement
 
Advertisement
Advertisement