సెట్స్‌లో దేవర  | Latest update on NTR Devara movies Shoot | Sakshi
Sakshi News home page

సెట్స్‌లో దేవర 

Jan 19 2024 1:24 AM | Updated on Jan 19 2024 7:58 AM

Latest update on NTR Devara movies Shoot - Sakshi

‘దేవర’ తాజా షెడ్యూల్‌లో జాయిన్‌ అయ్యారట ఎన్టీఆర్‌. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘దేవర’. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైందని తెలిసింది.

ఓ భారీ సెట్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా టాకీ పార్ట్‌ తీస్తారని తెలిసింది. అలాగే ఈ షెడ్యూల్‌లోనే ఓ పాట కూడా చిత్రీకరించే ఆలోచనలో ఉందట యూనిట్‌. న్యూ ఇయర్, సంక్రాంతి సెలవుల తర్వాత ఎన్టీఆర్‌ ‘దేవర’ షూటింగ్‌లో జాయిన్‌ కావడం ఇదే. రెండు భాగాలుగా కల్యాణ్‌ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ తొలి భాగం ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement