Laal Singh Chaddha And Raksha Bandhan World Wide Box Office Collection - Sakshi
Sakshi News home page

Bollywood: మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్‌’పైనే

Aug 14 2022 10:49 AM | Updated on Aug 14 2022 11:19 AM

Laal Singh Chaddha And Raksha Bandhan Box Office Collection - Sakshi

బాలీవుడ్‌కు వరుసగా షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి ఉత్తరాది ఆడియెన్స్ కు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా మోసం చేసేసాడు.మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే కనిపించడం లేదు.

(చదవండి: కావాలనే టార్గెట్‌ చేశారు.. అందుకే ఓపెనింగ్స్‌ తగ్గాయి: కరీనా కపూర్‌)

కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 11న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చెడ్డా’గా వస్తే, అక్షయ్ ఏమో ‘రక్షా బంధన్’ అంటూ సెంటిమెంట్ మూవీ తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి.

ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తొలి రోజు ఇండియా వరకు చూసుకుంటే 12 కోట్లు అట. మొత్తంగా శనివారం వరకు అంటే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 27.5 కోట్లు కలెక్ట్‌ చేసింది. ఇక అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తొలి రోజు వసూళ్లు 8 కోట్లు దాటాయట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 21.60 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలు కలసి వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు పట్టుమని 20 కోట్లు దాటించలేకపోయారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని బీటౌన్ అస్సలు ఊహించలేదు.

(చదవండి: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ మూవీ రివ్యూ)

ఈ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్‌ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత బ్యానర్ నుంచి మూవీ రిలీజ్ అవుతుండం, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ నిరాశపరిచినా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement