Krishnam Raju Character Missing In Radhe Shyam In USA Theaters Deets Here - Sakshi
Sakshi News home page

Krishnam Raju In Radhe Shyam: యూఎస్‌ షోలలో కనిపించని కృష్ణంరాజు.. ఎందుకంటే?

Mar 11 2022 4:28 PM | Updated on Mar 11 2022 4:50 PM

Krishnam Raju Character Missing In Radhe Shyam USA Theaters - Sakshi

Krishnam Raju Character Missing In Radhe Shyam USA Theaters: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా సినీ ప్రేక్షకలోకం ఎంతగానో ఎదురు చూసిన చిత్రం 'రాధేశ్యామ్‌' ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుమారు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత రిలీజై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ ప్రముఖ హస్త సాముద్రికుడు విక్రమాదిత్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నాడు. అలాగే పీరియాడికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీలో ప్రభాస్‌ పెద్దనాన్న రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు కూడా ఒక కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'రాధేశ్యామ్‌' మూవీలో కృష్ణంరాజు 'పరమహంస' రోల్‌లో నటించారు. ఇదివరకూ బిల్లా, రెబల్‌ చిత్రాల్లో వీరిద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోగా 'రాధేశ్యామ్‌' మూడో చిత్రం. 

ఇదిలా ఉంటే తాజాగా ఆశ్చర్యపరుస్తున్న వార్త ఏంటంటే పరమహంస పాత్ర పోషించిన కృష్ణంరాజు కేవలం ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు మాత్రమే పరిమితయ్యారట. విదేశీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రంలో కృష్ణంరాజు కనిపించట్లేదని సమాచారం. దీంతో కృష్ణంరాజదు ఎందుకు కనిపించడంలేదంటూ ఫ్యాన్స్‌ మేకర్స్‌ను సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారట. అయితే ఈ పాత్రను తమిళం, మలయాళం, కన్నడ,  హిందీ భాషల్లో కోలీవుడ్‌ యాక్టర్‌ సత్యరాజ్‌ పోషించారు. ట్రైలర్‌ విడుదలైనప్పటినుంచి ఈ విషయం స్పష్టమైంది. కానీ ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో సైతం కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్‌ కనిపించినట్లు యూఎస్‌ఏ ఆడియెన్స్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు కృష్ణంరాజు నటించడమే కాకుండా స్వయంగా డబ్బింగ్‌ కూడా చెప్పారు. అలా అయితే యూఎస్‌ తెలుగు ప్రింట్‌లో కృష్ణంరాజుకు బదులు సత్యరాజ్‌ను ఎందుకు చూపించారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదట. ఇంతేకాకుండా యూకేకి పంపిన కొన్ని ప్రింట్లలో కృష్ణంరాజు పాత్రను మొత్తానికే తీసేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement