ద‌ర్శ‌కుడిని పెళ్లాడిన హీరోయిన్‌ | Krishna And His Leela Actress Shalini Vadnikatti weds Manoj Beedha | Sakshi
Sakshi News home page

సైలెంట్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చిన హీరోయిన్‌

Aug 23 2020 10:24 AM | Updated on Aug 23 2020 1:27 PM

Krishna And His Leela Actress Shalini Vadnikatti weds Manoj Beedha - Sakshi

ఇటీవ‌లి కాలంలో ఓటీటీలో విడుద‌లైన మంచి విజ‌యం సాధించిన కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా హీరోయిన్‌ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకుంది. ఆ సినిమాలో రాధ క్యారక్టర్ కనిపించి అలరించిన షాలిని.. ట్రెడిషనల్ గా క‌నిపిస్తూనే గ్లామ‌ర్‌తోనూ ఆక‌ట్టుకుంది. ఒక్క సినిమాతోనే ఎంతోమందిని త‌న ఫ్యాన్స్‌గా మార్చుకుంది. తాజాగా ఈ హీరోయిన్ సడన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది.

కరోనా కారణంగా పెద్దగా బంధువులు హడావుడి లేకుండా త‌మిళ ద‌ర్శ‌కుడు మనోజ్ బీదను వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక ప్లస్ అనే కన్నడ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన షాలిని.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. నటిగా ఇప్పుడిప్పుడే మంచి పేరు దక్కించుకుంటున్న ఈమె హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకొని ఊహించని షాక్ ఇచ్చింది.(చదవండి : రావణ లంక ఆడియో విడుదల..)

Advertisement
 
Advertisement
Advertisement